AP Highcourt: ఉద్దేశం నెరవేరనప్పుడు ఎస్సీ కార్పొరేషన్‌ మూసేయడం మంచిది: హైకోర్టు

ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు మళ్లింపు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Updated : 06 Jan 2023 22:42 IST

అమరావతి: ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. నిధులు మళ్లించేందుకు వీల్లేదని 2003లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు మళ్లింపు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. స్వయం ఉపాధి కింద బడ్జెట్‌లో కేటాయించిన రూ.7వేల కోట్లలో ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని... అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రజాధనం వృథా చేయడమేనని వ్యాఖ్యానించింది. ఎస్సీ కార్పొరేషన్‌ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదని వ్యాఖ్యానించింది. బిల్లులు చెల్లింపు వివరాలతో అదనపు అఫిడవిట్‌ వేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని