Andhra News: మంత్రి రజిని, ఎంపీ అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు
గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాప్‌రెడ్డి, శ్వేతారెడ్డి, జి.వి.దినేశ్‌రెడ్డి, శివపార్వతికి నోటీసులు పంపింది.
అమరావతి: గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాప్‌రెడ్డి, శ్వేతారెడ్డి, జి.వి.దినేశ్‌రెడ్డి, శివపార్వతికి నోటీసులు పంపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో 21.50 ఎకరాల స్థలంలో తమకు తెలియకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసి ఇవ్వడంపై హైకోర్టులో రైతుల పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డి.కె. పట్టాలు రద్దు చేయకుండా తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం... గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో విధించింది. ఎన్‌వోసీ ఇచ్చిన తహసీల్దార్‌తో సహా పలువురికి నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. అప్పటివరకూ స్టేటస్ కో ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. అదేవిధంగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మంత్రి రజిని, ఇతరులను హైకోర్టు ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
బెంగాల్లో పెళ్లింట మహావిషాదం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్