Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
పాత పింఛను విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

గుంటూరు: 37 డిమాండ్లు సాధించినందున ఉద్యమం విరమిస్తున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన ఏపీ జేఏసీ నాలుగో ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ.. పాత పింఛను విధానానికే ఏపీజేఏసీ అమరావతి కట్టుబడి ఉందన్నారు. పాత పింఛను విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కోసం తొలి నుంచి పోరాడింది తామేనని చెప్పారు. పాత పింఛనుపై హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న బొప్పరాజు.. మళ్లీ చలో విజయవాడ పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి చెప్పామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం.. గతంలో ఏ ప్రభుత్వానికీ ఇవ్వలేదన్నారు. 92 రోజులుగా అలుపెరగని పోరాటం చేశామని, ఉద్యమ ఫలితంగానే చాలా డిమాండ్లు సాధించామని బొప్పరాజు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!