కరోనా లెక్కలు దాచాల్సిన అవసరంలేదు: ఆళ్ల

కరోనా రోగులకు సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా

Updated : 29 Jul 2020 14:13 IST

రాజమహేంద్రవరం: కరోనా రోగులకు సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్‌పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో కొవిడ్‌ రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున వెచ్చిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా కరోనా బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. మెనూ అమలు చేయకపోయినా, సమయానికి ప్రభుత్వం నిర్దేశించిన ఆహారం అందించకపోయినా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారని గుర్తు చేశారు.

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని మరో మారు స్పష్టం చేశారు.  దేశంలో ఏ రాష్ట్రం ఖర్చుపెట్టనన్ని నిధులు కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వెచ్చిస్తున్నట్టు చెప్పారు. కరోనా మృతుల లెక్కలు దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా కరోనా నివారణ చర్యలు చేపట్టిందని ఆళ్ల నాని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని