Andhra News: విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలతో మంత్రి బాలినేని చర్చలు

విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఐకాస నేతలతో చర్చిస్తున్నారు. గత నెల 28న 24 డిమాండ్లతో ఉద్యోగులు ఇచ్చిన  నోటీసుపై  మాట్లాడుతున్నారు.

Updated : 17 Feb 2022 03:30 IST

విజయవాడ: విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఐకాస నేతలతో చర్చిస్తున్నారు. గత నెల 28న 24 డిమాండ్లతో ఉద్యోగులు ఇచ్చిన  నోటీసుపై  మాట్లాడుతున్నారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు నోటీసులో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటు చేసిన పీఆర్‌సీ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వేతన సవరణ బాధ్యతను విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులకే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది క్రమబద్ధీకరణకు డిమాండ్‌ చేశారు. వీటన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని చర్చిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని