Botsa: కమిటీ వేశాం కదా.. సీఎంవో ముట్టడి భావ్యమా?: బొత్స

సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ యూటీఎఫ్‌ నేతృత్వంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునివ్వడంపై విద్యాశాఖ

Updated : 25 Apr 2022 13:21 IST

విజయనగరం: సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ యూటీఎఫ్‌ నేతృత్వంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునివ్వడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

సీపీఎస్‌ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని.. అధ్యయనం తర్వాత జరిగే కమిటీ భేటీలో దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈలోపే ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి వెళ్లడం భావ్యమా?ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ధర్మమా? అని బొత్స ప్రశ్నించారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి అంశాన్నీ మానవతా దృక్పథంతో చూసి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లు అని.. ఈ రెండు రంగాల్లోనూ విప్లవాత్మకమైన నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుంటోందని మంత్రి చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని