Botsa satyanarayana: ఉద్యోగుల కంటే ప్రజల సమస్యలే మాకు ముఖ్యం: మంత్రి బొత్స

ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల సమస్యలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు.

Updated : 17 Nov 2022 17:54 IST

అమరావతి: ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల సమస్యలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందంటూ ప్రచారం చేయటం సరికాదన్నారు. ఉద్యోగులతో చర్చించాకే పీఆర్సీపై ఉత్తర్వులు వచ్చాయని వెల్లడించారు. 12వ పీఆర్సీ వేయమని కోరడం తప్పు కాదన్న మంత్రి.. ఉద్యోగులకు జీతాల రూపంలో  ప్రభుత్వం రూ.80వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఉద్యోగులు కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్లటం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదని, కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళితే ఉద్యోగులకే సమస్య అని మంత్రి బొత్స వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని