Andhra News: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు సిద్ధం: మంత్రి బొత్స

ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు.

Published : 07 Dec 2022 01:04 IST

అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. పీఆర్సీ పెండింగ్‌ సమస్యలు, సీపీఎస్‌ అంశంపై సచివాలయంలో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  కేవలం సమాచార లోపం వల్లే సీపీఎస్‌పై సమావేశం అని ఆర్థికశాఖ అధికారులు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్యులకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. 

మరికొన్ని ప్రభుత్వ విభాగాల్లో 62 ఏళ్ల వయోపరిమితి పెంచాల్సిందిగా ఉద్యోగులు కోరినట్టు ఆయన వివరించారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల ప్రతీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. అంతకు ముందు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 3గంటల పాటు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. తొలుత సీపీఎస్‌ అంశంపై చర్చించాలని నిర్ణయించినా సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆఖరు నిమిషంలో పీఆర్సీ పెండింగ్‌ సమస్యలు చర్చిద్దామని మంత్రుల కమిటీ సమాచారం పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని