Andhra News: భోగాపురం విమానాశ్రయానికి అడ్డంకులు తొలగాయి.. త్వరలో శంకుస్థాపన: మంత్రి బొత్స

భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంలో కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై  విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు.

Updated : 05 Nov 2022 19:14 IST

విజయనగరం: రాష్ట్ర హైకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు ద్వారా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి న్యాయపరమైన అన్ని అడ్డంకులు తొలగినట్లేనని రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. భూసేకరణకు సంబంధించి తదుపరి ప్రక్రియ పూర్తిచేయడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించిందని పేర్కొన్నారు. త్వరలోనే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 11న విశాఖ పర్యటనకు వస్తున్నారని, ఆ రోజు భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన ఉండదని స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంలో కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై  విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. ఎయిర్‌పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన ఉంటుందన్నారు. గిరిజన వర్సిటీ భూ సేకరణలో భాగంగా రైతుల నుంచి పూర్తి స్థాయిలో అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని