రూ.1,168 కోట్ల ప్యాకేజీతో ఆదుకున్నాం: గౌతంరెడ్డి

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకున్నామని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ. 1,168 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీతో ఇచ్చామని చెప్పారు. ఏపీ ఆర్థిక పురోగతిపై మంత్రి వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘పరిశ్రమలకు వెసులుబాటుకు

Published : 27 Jul 2020 18:56 IST

అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకున్నామని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ. 1,168 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. ఏపీ ఆర్థిక పురోగతిపై మంత్రి వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘పరిశ్రమల వెసులుబాటుకు రూ. 188 కోట్ల విద్యుత్‌ స్థిర ఛార్జీలు మాఫీ చేశాం. కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. కీలక రంగాలతో ఆర్థిక బలోపేతానికి మార్గాలు అన్వేషిస్తున్నాం. వలసలను స్థానిక పరిశ్రమల్లోకి వినియోగించుకునే అంశంపై ఆలోచిస్తున్నాం’’అని గౌతమ్‌రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని