Amaravati: రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటిస్తారని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

Published : 19 Jun 2024 18:02 IST

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటిస్తారని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని మంత్రి వివరించారు.  టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. దీనికోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయసలహా తీసుకుని ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని