AP News: ‘వన్‌ ఇండియా వన్‌ బస్‌’ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పేర్ని నాని

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ‘వన్‌ ఇండియా వన్‌ బస్‌’ యాప్‌ను ఆవిష్కరించారు.

Updated : 05 Apr 2022 06:38 IST

అమరావతి: ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ‘వన్‌ ఇండియా వన్‌ బస్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. రెడ్‌బస్‌ తరహాలో బస్‌ ఆపరేటర్లు సొంతంగా యాప్‌ను రూపొందించుకున్నారు. ఈ యాప్‌ను బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసింది. ఈ సందర్భంగా హోం ట్యాక్స్‌ తగ్గించాలని మంత్రి పేర్ని నానిని బీవోసీఐ ప్రతినిధులు కోరారు. ఈ నెల 11 నుంచి కొత్త కేబినెట్‌ వస్తుందని పేర్నినాని తెలిపారు. బస్‌ ఆపరేటర్ల సమస్య పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అంతర్‌రాష్ట్ర ఒప్పందానికి తెలంగాణ లారీ ఓనర్ల సంఘం కోరినట్లు తెలిపారు. ఒప్పందం వల్ల తెలంగాణ లారీ ఓనర్లకు లాభం అని, ఏపీకి నష్టమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ఒప్పుకున్నా తెలంగాణ అధికారులు స్పందించడం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో తిరిగే ఏపీ బస్సులపై కేసులు రాయవద్దని కోరామన్నారు. లేకుంటే ఏపీలోకి వచ్చే తెలంగాణ బస్సులకూ అలాగే వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని