AndhraPradesh: మాకు లిఖితపూర్వక హామీ కావాలి: పీఆర్సీ సాధన సమితి నేతలు

ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ

Published : 04 Feb 2022 20:36 IST

ఏపీ మంత్రుల కమిటీతో కొనసాగుతున్న భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అయితే ముందుగా పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులతో సీఎస్‌ సమీర్‌ శర్మ మాట్లాడారు. పీఆర్సీ కమిషన్‌ నివేదిక ఇస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్లు సమాచారం. మంత్రుల కమిటీ చెబితే వింటామని తేల్చి చెప్పారు. 

సమస్యలు చెబితేనే తెలుస్తాయని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాము చెప్పాల్సింది చెప్పామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కార్యాచరణ ప్రకటించినందున ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌పై ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉంది. సమస్యపై సీఎం ఆలోచిస్తున్నారని స్టీరింగ్‌ కమిటీ సభ్యులకు మంత్రులు చెప్పారు. లిఖితపూర్వక హామీ కావాలని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని