AP NEWS : విజయవాడకు వంగవీటిపేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలి: పేర్ని నాని

జిల్లా కేంద్రాలు, పునర్‌వ్యవస్థీకరణపై అభ్యంతరాలుంటే చెప్పాలన...

Published : 28 Jan 2022 01:49 IST

విజయవాడ: జిల్లా కేంద్రాలు, పునర్‌వ్యవస్థీకరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని సూచించారు. గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా జిల్లా కేంద్రాలు ఉండేవని చెప్పారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలని తెలిపారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు వెల్లడించారు. చర్చకు రావాలని ఉద్యోగ సంఘాలను పదేపదే కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆర్థికశాఖది తప్పని నిరూపిస్తే సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.

ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని కృష్ణా జిల్లా ప్రజలు పాదయాత్రలో కోరారని మరో మంత్రి కొడాలి నాని తెలిపారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. తమ వద్దకు వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి నాని విసుర్లు విసిరారు. భాజపాను తెదేపాకు అనుబంధంగా మార్చారని కొడాలి ఆరోపించారు. గోవాలో క్యాసినోల సంస్కృతిని ఆపొచ్చు కదా అని వీర్రాజును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సైన్యాన్ని పంపి ఆపవచ్చు కదా అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని