AP news:  ఆ ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయండి: ఎమ్మెల్యే ఆగ్రహం

విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం భవుర్తి పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె.. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడాన్ని గమనించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురికాగా... ఆయన స్థానంలో మరొకరిని...

Updated : 26 Oct 2021 05:57 IST

చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం భవుర్తి పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె.. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడాన్ని గమనించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురికాగా... ఆయన స్థానంలో అధికారులు మరొకరిని తాత్కాలికంగా నియమించారు. ఆ తాత్కాలిక ఉపాధ్యాయుడు సైతం రావడం లేదని గ్రామస్తులు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయాలంటూ ఆవేశపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని