AP News: ఏపీలో గెజిట్‌ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలివే..!

ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 26 Jan 2022 09:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ఇవాళ విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం.. ఏపీలో జిల్లాలివే..

శ్రీకాకుళం, మన్యం(పార్వతీపురం), విజయనగరం, అల్లూరి సీతారామరాజు(పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లికాకినాడకోనసీమ(అమలాపురం), తూ.గో(రాజమహేంద్రవరం), ప.గో(భీమవరం), ఏలూరు, కృష్ణా(మచిలీపట్నం), ఎన్టీఆర్‌(విజయవాడ), గుంటూరు, పల్నాడు (నరసరావుపేట)బాపట్ల, ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి(పుట్టపర్తి), కడప, అన్నమయ్య(రాయచోటి), చిత్తూరు, శ్రీ బాలాజీ(తిరుపతి).

మరోవైపు నిన్న కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం, ఇవాళ విడుదలైన గెజిట్‌లలో కొన్నిజిల్లాలకు సంబంధించి మార్పులుండటం గమనార్హం.

గెజిట్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని