ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు.

Updated : 01 Apr 2021 12:13 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో నీలం సాహ్ని విజయవాడలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఇవాళ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తొలి మహిళా ఎస్‌ఈసీగా ఆమె గుర్తింపు పొందారు. కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు, ఉద్యోగులు కొత్త ఎస్‌ఈసీకి అభినందనలు తెలిపారు. ఎస్‌ఈసీగా తనను ఎంపిక చేసిన గవర్నర్‌కు ఈ సందర్భంగా నీలం సాహ్ని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో పరిషత్‌ ఎన్నికలు పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని