AP NewDistricts: జిల్లాల విభజనపై భారీ కసరత్తు చేశాం: ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌

ఏపీలో జిల్లాల విభజనపై భారీ కసరత్తు చేశామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా

Updated : 27 Jan 2022 17:00 IST

అమరావతి: ఏపీలో జిల్లాలపై భారీ కసరత్తు చేశామని.. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే జిల్లాల విభజన చేపట్టామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. జన సాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ప్రాంతాల మధ్య దూరం, పాలనా సౌలభ్యం తదితర అంశాలను పరిగణించి ప్రతిపాదించామని విజయ్‌కుమార్‌ తెలిపారు.

‘‘ ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా.. అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశాం. తొలుత ప్రజల రవాణా సౌలభ్యాన్ని పరిశీలించాం. మన్యం ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు ఏర్పాటు చేశాం. అందుకే రంపచోడవరం ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చాం. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశాం. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించాం. నూజివీడును ఏలూరు జిల్లా పరిధిలోకి వెళితే మిగిలిన 14 నియోజకవర్గాలకు రెండు జిల్లాలకుగా ప్రతిపాదన చేశాం’’ అని విజయ్‌కుమార్‌ వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని