గవర్నర్‌ ఆమోదంతో పోలీసు శాఖ ఏర్పాట్లు..

పాలనా వికేంద్రీకరణ చట్టం 2020కి గవర్నర్‌ ఆమోదం తెలపడంతో పోలీసు శాఖ సన్నాహాలు చేసుకుంటోంది. విశాఖలో పోలీసు అవసరాలు, భద్రత

Updated : 01 Aug 2020 12:39 IST

అమరావతి : పాలనా వికేంద్రీకరణ చట్టం 2020కి గవర్నర్‌ ఆమోదం తెలపడంతో పోలీసు శాఖ సన్నాహాలు చేసుకుంటోంది. విశాఖలో పోలీసు అవసరాలు, భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీని నియమించింది. విశాఖ పోలీసు కమిషనర్‌ నేతృత్వంలో ఈ కమిటీని డీజీపీ ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది పోలీసు ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని డీజీపీ ఆదేశించారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను నిన్న గవర్నర్‌ ఆమోదించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని