Andhra News: సీఐడీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌ నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

Updated : 11 Feb 2022 12:36 IST

అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌ నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. జీజీహెచ్‌ వద్ద బారికేడ్లు పెట్టడంతో పాటు అక్కడి వంతెన వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు సీఐడీ కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించగా వారిని ఆపేశారు. ఆంక్షలతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసుల ఆంక్షలపై తెలుగు యువత నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. దీంతో తెలుగు యువత నాయకులు మల్లేశ్వరరావు, రావిపాటి సాయికృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అరెస్టయిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు ఈ ఉదయం మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు నేతలు సీఐడీ కార్యాలయానికి వెళ్లగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం దేవినేని ఉమ సహా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని