AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 19న జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ నియామక బోర్డు నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంచింది.

Updated : 05 Feb 2023 19:57 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష(SI Recruitment Preliminary Exam)కు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్షకు హాల్‌ టిక్కెట్లను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు నేటి సాయంత్రం 5గంటల నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/UI/index  (ఈ లింక్‌పై క్లిక్‌ హాల్‌టిక్కెట్లు పొందండి) నుంచి  హాల్‌టిక్కెట్లు  డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు, ఈ పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుండగా.. తొలి పేపర్‌ ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు; రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా  411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453 మంది పురుషులు దరఖాస్తు చేయగా.. 32,594 మంది మహిళలు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని