Ap polycet: 29న పాలిసెట్‌ పరీక్ష.. 10 రోజుల్లో ఫలితాలు: సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ పరీక్షలను ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌

Published : 27 May 2022 20:07 IST

విజయవాడ: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ పరీక్షలను ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కమిషనర్‌ మీడియాతో మాట్లాడారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 404 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని.. పరీక్ష ప్రారంభించిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని కమిషనర్‌ తెలిపారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని