AP PRC: ఏపీ పీఆర్‌సీ ఛైర్మన్‌ మన్మోహన్‌సింగ్‌ రాజీనామా

ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ పీఆర్సీ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Published : 18 Jun 2024 20:52 IST

అమరావతి: ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ పీఆర్సీ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగులను కేటాయించకపోవడంతో ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌కి మంగళవారం లేఖ రాశారు. 2023 జులైలో తనను నియమించినప్పటికీ  కమిషన్‌కు ఉద్యోగులు లేకపోవడంతో పని ప్రారంభించలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు మరికొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఛైర్మన్‌  పదవి నుంచి తనను రిలీవ్‌ చేయాలని మన్మోహన్‌సింగ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని