
ANDHRAPradesh : అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగాం.. ఎవరికీ భయపడేది లేదు: బొప్పరాజు
విజయనగరం: చలో విజయవాడ చూశాకైనా ప్రభుత్వ నిర్ణయం మారాలని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు బొప్పరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తొమ్మిది మంది నేతలు చర్చలకు వెళ్లి డిమాండ్లను చెప్పి వచ్చామని చెప్పారు. మా డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని కోరారు. జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారు.. వాటిని సరిద్దిద్దాలి డిమాండ్ చేశారు. అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగామని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగు ముందుకేస్తే తాము నాలుగు అడుగులు వేస్తామని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తేవొద్దని బొప్పరాజు పేర్కొన్నారు.
పీఆర్సీ ముసుగులో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించి ఉద్యోగులను రోడెక్కించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని శ్రీకాకుళంలో ఉద్యోగులు విమర్శించారు. పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట మహిళా ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నా్యి. రివర్స్ పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.