Vijayawada: అసాధారణంగా సీఏల అరెస్టులు: ఏపీ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్‌

రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదని ఏపీ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్‌ అన్నారు.

Updated : 02 Apr 2023 15:04 IST

విజయవాడ: రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదని ఏపీ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్‌ అన్నారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ) అరెస్టులు అసాధారణంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రఖ్యాత బ్రహ్మయ్య అండ్‌ కొ సంస్థ ఆడిటర్‌ శ్రావణ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులపై ప్రైవేటు కేసులు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల అరెస్ట్‌లలో చట్టబద్ధత ఎంత? అనే అంశంపై విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నేతి మహేశ్‌ మీడియాతో మాట్లాడారు. 

అక్రమ అరెస్ట్‌లతో రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావడం లేదని నేతి మహేశ్‌ విమర్శించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ప్రొఫెషన్‌ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. దీనిపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించామని.. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్ లా లేకపోవడంపై ప్రజలు కూడా పోరాడాలని మహేశ్ పిలుపునిచ్చారు. సీఏలను అన్యాయంగా అరెస్టు చేస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసే సీఏల అరెస్టును అందరూ ఖండించాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని