Telangana News: ఆంధ్రప్రదేశ్‌ ధాన్యానికి అనుమతి లేదు: తెలంగాణ పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే ధాన్యం నియంత్రణకు కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.

Updated : 14 Apr 2022 14:11 IST

కోదాడ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే ధాన్యం నియంత్రణకు కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ధాన్యం సరఫరా చేస్తున్న వాహనాలను పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనబోమని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని నిన్న మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని