నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 09 Jan 2021 12:49 IST

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు.

 ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది.

ముఖ్యమైన తేదీలివే

తొలి దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 23

నామినేషన్ల స్వీకరణ- జనవరి 25

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27

నామినేషన్ల పరిశీలన- జనవరి 28

నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

రెండో దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 27

నామినేషన్ల స్వీకరణ- జనవరి 29

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

మూడో దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 31

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

నాలుగో దశ

నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 4

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 17 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

ఇవీ చదవండి..

నిమ్మగడ్డతో అధికారుల బృందం భేటీ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని