Andhra News: సర్వేయర్ల గ్రేడ్‌ మార్చేందుకు సీఎం అంగీకారం: వెంకట్రామిరెడ్డి

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్‌-3ను గ్రేడ్‌-2కి మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంగీకరించినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Published : 26 Nov 2022 01:44 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్‌-3ను గ్రేడ్‌-2కి మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంగీకరించినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 11వేల మంది గ్రేడ్‌-3 సర్వేయర్లను గ్రేడ్-2లోకి మార్చాలన్న తమ విన్నపానికి సీఎం ఈ మేరకు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను వెంకట్రామిరెడ్డి సహా సర్వే శాఖ అధికారులు కలిశారు.

అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని బదిలీలకు అనుమతించాలని సీఎంను మరోసారి కోరినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్‌లోనే బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు సీఎంకు గుర్తుచేశామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగడం వల్ల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని, ఏప్రిల్‌లో బదిలీలు చేస్తామని సీఎం తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించడం పట్ల సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని