AP SSC exam Hall tickets: పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల
ఏపీలో పదోతరగతి పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వివరాలను ఎస్‌ఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షల హాల్‌టిక్కెట్లను SSC తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3: ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6: సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8: ఆంగ్లం, ఏప్రిల్ 10: గణితం, ఏప్రిల్ 13: సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15: సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17: కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18: వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
GT vs CSK: గుజరాత్ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం
-
India News
Navjot Singh Sidhu: జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..!
-
World News
NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
-
Movies News
Pathaan: ‘బేషరమ్ రంగ్’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!