AP TET: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ రేపే

ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెట్‌ ఆన్‌లైన్‌

Published : 09 Jun 2022 21:42 IST

అమరావతి: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో రేపు ఉదయం 10.30 నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులిటెన్‌, సిలబస్‌, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్‌లైన్‌ పరీక్ష సూచనలు వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని