అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ

Updated : 06 Oct 2020 13:05 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీలోని సీఎం అధికారిక నివాసం 1-జన్‌పథ్‌ నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా జలాల వివాదంపై రెండు రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఎవరి వాదన వారిది..
బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంటుండగా.. నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్‌తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్‌ చేయనుండగా.. రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ కోరనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణ.. పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని