Andhra News: ఆ వేతనం నాకొద్దు: ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ లేఖ

ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దంటూ ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి లేఖ రాశారు. ఏపీఐఐసీ ద్వారా తనకు వచ్చే వేతనాన్ని తిరిగి ఖజానాకు జమ...

Updated : 20 Apr 2022 17:53 IST

అమరావతి: ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దంటూ ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి లేఖ రాశారు. ఏపీఐఐసీ ద్వారా తనకు వచ్చే వేతనాన్ని తిరిగి ఖజానాకు జమ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తనకు గౌరవ వేతనం అవసరం లేదని లేఖలో గోవిందరెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్ల వేతనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీలింగ్‌ విధించింది. వేతనాలు రూ.65వేలు మించరాదని పేర్కొంది. ఇటీవల వరకు ఏపీఐఐసీ ఛైర్మన్‌కు ‘ఆర్‌’ కేటగిరి హోదాను ప్రభుత్వం కల్పించింది. వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకు గాను రూ.3.82 లక్షలు వరకు చెల్లించేవారు. అయితే ప్రభుత్వం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గౌరవ వేతనాలపై సీలింగ్‌ విధించడంతో ఒక్కసారిగా ఏపీఐఐసీ ఛైర్మన్‌ వేతనం రూ.65వేలకు తగ్గింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు