
విశాఖ ఉక్కు.. కేంద్రంపై పోరుకు మేం రెడీ
ఏపీ ఎన్జీవోల సంఘం
అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఏపీఎన్జీవోల సంఘం మద్దతు ప్రకటించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్టు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. కేంద్రంపై పోరుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకతీతంగా అందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కేంద్రంతో మాట్లాడాలని, సీఎం జగన్ దిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.