Updated : 07 Jun 2021 20:08 IST

టెక్నీషియన్ల తప్పిదం.. కోట్లు చెల్లించిన యాపిల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిపేర్‌ సెంటర్‌లోని ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి యాపిల్‌ సంస్థ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రిపేర్‌కు వచ్చిన ఫోన్‌లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. తాజాగా ‘టెలిగ్రాఫ్‌’ అనే ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంతో కాలిఫోర్నియాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఒరెగాన్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి తన యాపిల్‌ ఫోన్‌ రిపేర్‌కు రావడంతో 2016లో సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లింది. పెగట్రాన్‌ సంస్థ ఆ సర్వీస్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఫోన్‌ రిపేర్‌ చేసే క్రమంలో అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫోన్‌లోని ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను ఆన్‌లైన్‌లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న యువతి ఆ ఫొటోలను తొలగించింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో యాపిల్‌ సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

యువతి తరఫు లాయర్‌ 5 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు 36 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అయితే, కంపెనీ ఎంతమొత్తం చెల్లించిందీ తెలియరాలేదు. ఈ వ్యవహారం వల్ల మానసిక క్షోభ అనుభవించినందుకు గానూ యువతికి యాపిల్‌ భారీ మొత్తం చెల్లించింది. అంతర్గత విచారణలో తప్పు చేసినట్లు తేలడంతో ఆ ఇద్దరు ఉద్యోగులను యాపిల్‌ తొలగించింది. అనంతరం పెగట్రాన్‌ సంస్థ నుంచి చెల్లించిన మొత్తాన్ని రాబట్టినట్లు సమాచారం. తొలుత పెగట్రాన్‌ ఆ సొమ్ము చెల్లించేందుకు నిరాకరించినప్పటికీ అనంతరం ప్రైవేటుగా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు  ‘టెలిగ్రాఫ్‌’ పేర్కొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని