APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష(APPSC Group-1 Priliminary exam) తేదీలో మార్పు చోటుచేసుకుంది. డిసెంబర్‌ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Published : 12 Nov 2022 02:02 IST

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష(APPSC Group-1 Priliminary exam) తేదీలో మార్పు చోటుచేసుకుంది. డిసెంబర్‌ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు కొత్త తేదీని నిర్ణయించారు. గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంతకముందు నిర్ణయించిన షెడ్యూల్‌ టైమింగ్స్‌ ప్రకారమే ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా  ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ నెలాఖరులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 92 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని