APSRTC: ఆర్టీసీలో 60ఏళ్లు దాటిన వృద్ధులకు 25శాతం రాయితీ: మంత్రి పేర్ని నాని
కొవిడ్ దృష్ట్యా 60ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని
అమరావతి: కొవిడ్ దృష్ట్యా 60ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. వయసు నిర్ధారణకు సంబంధించి ఆధార్, ఓటరు ఐడీ లాంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రాయితీ పొందవచ్చని వెల్లడించారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరే ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. 1800లకు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల కోసం ఆయిల్ కంపెనీల నుంచి నెలకు 8లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్టు వివరించారు. చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే డీజిల్ ధరలో మార్పులు వచ్చాయన్నారు. గతంలో రూ.15 వరకు తేడా ఉండేదని, ఇప్పుడు బయటి బంకుల్లోనే తక్కువ ధరకు దొరుకుతుందన్నారు. దీంతో బయటి బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.1.50కోట్లు ఆదా అవుతుందన్నారు. బయటి బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయడం వల్ల నెలకు రూ.33.83కోట్లు ఆదా అయ్యిందని మంత్రి వివరించారు. తిరుమల ఘాట్‌రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!