APSRTC: స్టీరింగ్ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.