Updated : 03 Feb 2022 06:07 IST

APSRTC: తిరుమల వెళ్లే భక్తులకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం

అమరావతి: సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. తిరుపతి- తిరుమల మధ్య సులభంంగా రాకపోకలు కొనసాగించేందుకు నూతన విధానం తీసుకొస్తున్నట్టు తెలిపింది. తిరుపతి బస్సులో సీటు బుక్‌ చేసుకునేటప్పుడే తిరుమల రాకపోకలకు కలిపి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. బస్సు టికెట్‌ సహా శ్రీవారి దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకున్నవారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. తిరుమల రాకపోకలకు టికెట్‌ తీసుకున్న వారికి టికెట్‌ ధరలో 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. భక్తులు తిరుపతి వెళ్లాక అదే టికెట్‌తో తిరుమలకు రాకపోకలు చేసే సదుపాయం కల్పించనున్నట్టు వెల్లడించారు. తిరుపతి చేరుకున్న సమయం నుంచి 72గంటల పాటు తిరుపతి-తిరుమల మధ్య టికెట్‌ చెల్లుబాటవుతుందన్నారు. రేపట్నుంచే ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని