APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. నిత్యం 1,075 స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన టికెట్లను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Published : 07 Feb 2023 19:49 IST

విజయవాడ: శివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు నిత్యం 1,075 స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన టికెట్లను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ఎండీ చెప్పారు. ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా ప్రయాణానికి 15 రోజులు ముందుగానే దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు