APSRTC: కర్ఫ్యూ దృష్ట్యా చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ పలు చర్యలకు ఉపక్రమించింది. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు..

Updated : 05 May 2021 13:38 IST

ఏపీకి టీఎస్‌ ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

 సరిహద్దుల వరకే నడుపుతామన్న టీఎస్‌ ఆర్టీసీ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ పలు చర్యలకు ఉపక్రమించింది. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లను నిలిపేసింది. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పడు బస్సులను ఏర్పాటు చేయనుంది. మ.12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. ఈ సమయం తర్వాత గమ్యస్థానాలు చేరుకునే సర్వీసులను సైతం ఆర్టీసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. కాగా, నేటి నుంచి ఈ నెల 18 వరకు ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

మరో వైపు ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ సైతం చర్యలు చేపట్టింది. ఏపీకి వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్వీసుల రిజర్వేషన్లను సైతం రద్దు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర సరిహద్దుల వరకే టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని