Published : 23 Sep 2022 02:25 IST

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీలో మరో 263 అద్దె బస్సులు.. టెండర్ల జారీకి ప్రకటన

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ నాటికి వెయ్యి అద్దెబస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన యాజమాన్యం.. వాటిని దశలవారీగా రోడ్డెక్కించేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సంస్థలో మరో 263 అద్దెబస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా కావాల్సిన అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రకటన జారీ చేసింది. 4 స్లీపర్, 6 నాన్ ఏసీ స్లీపర్, 12 సూపర్ లగ్జరీ, 15 ఆల్ట్రా డీలక్స్ బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటితో పాటు 30ఎక్స్‌ప్రెస్‌, 95 ఆల్ట్రా పల్లెవెలుగు, 72 పల్లెవెలుగు బస్సులు, 27 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 2 సిటీ ఆర్డినరీ బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపించనుంది. అద్దె బస్సులు నడిపేందుకు ఆసక్తి కలిగిన వారు టెండర్లు దాఖలు చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 10 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని