APSRTC: విలీనంతో ఆశించిన ప్రయోజనాలేవీ?: ఆర్టీసీ సంఘాల ఆక్షేపణ

ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎంయూ, ఈయూ సహా వివిధ

Published : 19 Aug 2022 14:33 IST

అమరావతి: ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు సహా ఇబ్బందులు తీర్చాలని ఐక్యవేదిక ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు వినతిపత్రాలు పంపాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగుల సంతకాల సేకరణ అనంతరం... ఈ నెల 21 నుంచి 28 వరకు సీఎంకు వరుసగా వినతిపత్రాలు పంపనున్నారు. 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ వినతిపత్రాలు పంపిస్తారు.

ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు. ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ వంటి సంక్షేమ పథకాలు నిలిపేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు లేకుండా నిర్ణయాలు అమలు చేసేస్తున్నారు’’అని ఆక్షేపించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts