Andhra News: ఆ రోజే సీఎంవోను బైక్‌లతో చుట్టుముడతాం: యూటీఎఫ్

ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్‌ కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌)ను

Updated : 23 Apr 2022 12:56 IST

అమరావతి: ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్‌ కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌)ను ఈనెల 25 లోపు రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో అదే రోజున బైకులతో సీఎంవోను చుట్టుముడుతామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో సీపీఎస్‌ ముడిపడి ఉందని తెలిపారు. ఈనెల 24లోపు సీఎంతో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావిస్తున్నామని సీఎం చెప్పారని వారు గుర్తు చేశారు. మేనిఫెస్టోలోని హామీనే తాము అడుగుతున్నట్లు యూటీఎఫ్‌ నాయకులు చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని