Dehydration: నీరు ఎప్పుడు తాగాలి?
శరీరానికి తగినంత నీరు అవసరమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని అంటున్నారు. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవ్వడం, శరీర అవయవాల పని తీరు మందగించడం తదితర..
ఇంటర్నెట్‌డెస్క్: శరీరానికి తగినంత నీరు అవసరమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలంటున్నారు. కానీ, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. అయితే, నీరు ఎప్పుడు తాగాలి? మన శరీరానికి నీరు అవసరమని తెలుసుకోవడం ఎలా? చాలామంది మనసులో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
ఇలాంటి సందేహాలను చాలా సులభంగా నివృత్తి చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే.. అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క. అలాకాకుండా ముడతలు పడుతూ, వెంటనే పూర్వస్థితికి రాకపోతే శరీరం డీ హైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోని. కనీసం గ్లాసు నీటిని తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైతే వీలైనంత వరకు నీడలో ఉండేలా జాగ్రత్తపడాలి.
ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి
డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. మైకం ఆవహిస్తుంది. కండరాలు నొప్పిస్తాయి. తలనొప్పి మొదలవుతుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడంలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య తలెత్తుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం