సైనిక నియామకాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు!

సైనిక నియామకాల్లో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు సైన్యం వెల్లడించింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు సైన్యం అంతర్గత నిఘాలో బయటపడింది....

Updated : 15 Mar 2021 01:43 IST

దిల్లీ: సైనిక నియామకాల్లో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు సైన్యం వెల్లడించింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు సైన్యం అంతర్గత నిఘాలో బయటపడింది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని సైన్యం కోరనున్నట్లు సమాచారం. ఓ జూనియర్‌ స్థాయి అధికారి ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరినీ వదిలేది లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నరవణె స్పష్టం చేశారు. అలాంటి వారికి పింఛను కూడా ఇవ్వకుండా సాగనంపుతామని హెచ్చరించారు.
 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts