Chandrababu: గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated : 12 Jun 2024 19:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అధికారులు ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్‌ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మంత్రులతో చంద్రబాబు సమావేశం.. 

ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం గురువారం అమరావతి చేరుకుంటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని