Andhra news: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. గన్నవరంలో సభావేదిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 07 Jun 2024 19:47 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్‌ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేక పోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు  చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్‌ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు