knee replacement: వేధించే మోకీలు నొప్పులకు కీలు మార్పిడితో పరిష్కారం

 మోకీలు నొప్పి ఉంటే కూర్చోలేం..ఎక్కువ సేపు నిలపడలేం..ఆ బాధ నరకాన్ని తలపిస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించుకోవాలంటే కీలు మార్పిడి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

Updated : 26 Jun 2022 18:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోకీలు నొప్పి ఉంటే కూర్చోలేం..ఎక్కువ సేపు నిలపడలేం..ఆ బాధ నరకాన్ని తలపిస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించుకోవాలంటే కీలు మార్పిడి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మోకీలు మార్పిడిలో గతంలో కంటే ఎన్నో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కీళ్లను అమర్చినపుడు ఉండే సానుకూలతలు, ఇబ్బందులెంటో జాయింట్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌ నీలం వెంకటరమణారెడ్డి వివరించారు. 

ఎన్నెన్నో మార్పులు

మోకీలు మార్పిడిలో ఎన్నో ఆధునిక హంగులు సమకూరాయి. 30 ఏళ్ల క్రితం సిమెంట్‌ పరికరాలు వాడేవాళ్లం, ప్రస్తుతం ఇంప్లాంట్లు సిమెంటు రహితం. ఇవి దేశంలో విరివిగా వినియోగించడం లేదు. వచ్చినా వాటి ఉపయోగం ఎంత వరకుంటుందో చూడాలి. ప్రస్తుతం ప్లాస్టిక్‌ ఇంప్లాంట్లు వాడుతున్నాం. గత పదేళ్ల నుంచి క్రాస్‌లిన్‌ ప్లాస్టిక్‌ వినియోగంలోకి రావడంతో చాలా ప్రయోజనకరంగా ఉంటోంది. వీటిలో అరుగుదల తక్కువగా ఉంటుంది. జీవితకాలం అధికంగా ఉంటుంది.

సాధారణంగానే ఉంటాయి..

ప్రస్తుతం మార్చుతున్న ఇంప్లాంట్లతో సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు. గతంలో సిమెంట్ ఇంప్లాంట్లు కొంచెం ఇబ్బందికరంగానే ఉండేవి. ఇపుడు నడవడం, నిల్చోవడం, కారులోకి వెళ్లి కూర్చొవడం సులువుగానే ఉంటుంది. మెట్లు ఎక్కడం, దిగడానికి సమస్య ఉండదు. నేల మీద కూర్చోవడం, పద్మాసనం వేయడంతో ఇంప్లాంట్ల జీవిత కాలం తగ్గిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని