Published : 13 Feb 2021 22:47 IST

3 వేల అగ్గిపుల్లలతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే!

భువనేశ్వర్‌: ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాకు చెందిన యువ కళాకారుడు వినూత్న ఆవిష్కరణ చేశాడు. మూడు వేలకు పైగా అగ్గిపుల్లలతో రేడియో నమూనా ఆవిష్కరించి అందరినీ ఆకర్షించాడు. వివరాల్లోకి వెళ్తే.. పూరీకి చెందిన సస్వంత్‌ రంజన్‌ సాహూ ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా వినూత్న ఆవిష్కరణ చేశాడు. 3,130 అగ్గిపుల్లలను వినియోగించి 1980 నాటి రేడియో నమూనాను ఆవిష్కరించారు. పానాసోనిక్‌ స్టీరియో రేడియోను ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించినట్లు సాహూ తెలిపారు. దీని తయారీకి నాలుగు రోజుల సమయం పట్టినట్లు రంజన్‌ తెలిపారు. రేడియో కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటూ.. వాటిని ఆదరించాలని ప్రజలను రంజన్‌ సాహూ కోరారు. 

ఇదీ చదవండి..

ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామంలో సర్పంచి ఏకగ్రీవమే!


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని