Asani Cyclone: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను

ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని  తుపాను కొనసాగుతోంది. ప్రస్తుతం కాకినాడ, విశాఖలకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయువ్య దిశగా 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా అసని కదులుతోంది.

Updated : 09 May 2022 23:20 IST

విశాఖపట్నం: ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని  తుపాను కొనసాగుతోంది. ప్రస్తుతం కాకినాడ, విశాఖలకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయువ్య దిశగా 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా అసని కదులుతోంది. ఇది మరింత వాయువ్యదిశగా కదులుతూ రేపు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయి. అనంతరం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. అసని తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. అసని తుపాను ప్రభావంతో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని